మార్కాపురం: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వికలాంగులకు స్థలాలకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ విజయ్ సునీతకు వినతి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తర్లుపాడు మండలం బుడ్డ పల్లి గ్రామానికి చెందిన వికలాంగులు తమకు న్యాయం చేయాలని కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గడ్డం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత 13 సంవత్సరాల క్రితం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వికలాంగులు దాతలు ఇచ్చినటువంటి స్థలంలో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నామన్నారు. ఇటీవల వేరే వ్యక్తులు వచ్చి ఇండ్లను పడవేసి వికలాంగులపై దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలిపారు. ప్రభుత్వం వికలాంగులపై కనికరించి ఇంటి స్థలానికి పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు.