కళ్యాణదుర్గం: ఎమ్మెల్యే వెంటనే తాగునీరు, రోడ్ల సమస్యలను పరిష్కరించాలి: వడ్డే పాల్యం లో మల్లన్న అనే సామాన్యుడు వేడుకోలు
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు వెంటనే స్పందించి మా గ్రామంలో తాగునీరు, రోడ్ల సమస్యను పరిష్కరించాలని కుందుర్పి మండలం వడ్డే పాల్యం కు చెందిన సామాన్యుడు మల్లన్న వేడుకున్నాడు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఆయన తన ఇంటిలో మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటున్నారని మా గ్రామంలో కూడా నీటి సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించారు. నీటి సమస్యతో పాటు రోడ్లను కూడా నిర్మించాలని కోరాడు. ఆ సామాన్యుడు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.