కొండపి: సింగరాయకొండ మండలంలోని ఓ పాడు పడ్డ బావిలో విద్యార్థి మృతి, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ లోని ఓపాడుబడ్డ బవిలో గత నెలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీటెక్ విద్యార్థి రాహుల్ మృతి చెందాడు. తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి జరిగిన ఘటనపై వివరణ అడిగి తెలుసుకున్నారు. రాహుల్ తల్లిదండ్రులు తమ కుమారుడిది హత్యానని అనుమాన వ్యక్తం చేస్తున్నారని పూర్తి దర్యాప్తు చేసి కేసుని త్వరగా పూర్తి చేయాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసు సిబ్బందిని ఆదేశించారు.