మార్కాపురం: జిల్లా కేంద్రంలోని కంభం సెంటర్లో కొద్ది రోజుల్లోనే కూలిపోయిన ట్రాఫిక్ సిగ్నల్ పోల్
మార్కాపురం జిల్లా కేంద్రంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో 17 లక్షల రూపాయలతో నూతనంగా కోర్ట్, కంభం సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్ పోల్స్ ఏర్పాటు చేశారు. ఇటీవల ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన విషయం తెలిసినదే. అయితే కొద్ది రోజుల్లోనే కంభం సెంటర్లో ఉన్న ఒకవైపు ట్రాఫిక్ సిగ్నల్ పోల్ పడిపోయింది. దీంతో స్థానికులు వాహనదారులు ఆశ్చర్యానికి గురయ్యారు