తాడిపత్రి: ఆలూరు కోన రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో పుష్పయాగం, చక్రస్నానం
తాడిపత్రి మండలం ఆలూరు కోన క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు అయిన శనివారం స్వామివారికి పుష్పయాగం, చక్ర స్నానం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాన అర్చకులు అభిషేకాలు, కాగడ హారతులు వంటి విశేష పూజలు చేశారు. భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయంతోపాటు పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.