మార్కాపురం: ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లటి మజ్జిగ ఉచితంగా పోసి పలువురికి ఆదర్శంగా నిలిచిన ఓ మహిళ
ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లటి మజ్జిగ ఉచితంగా పోసి ఓ మహిళా పలువురికి ఆదర్శంగా నిలిచింది. పొదిలిలో అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షురాలు పద్మావతి ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రతిరోజు మజ్జిగ అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికి 30 రోజులుగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. దీంతో ఆమె సేవా దృక్పథానికి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరువలేనివి అన్నారు.