రాయదుర్గం: నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలు
ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 106 వ జయంతిని రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కణేకల్లు మండలం కొత్తపల్లి గ్రామంలో ఫెర్రర్ విగ్రహానికి స్థానికులు పూలమాలలు వేసి ఆయన సేవలు కొనియాడారు. అనంతపురం జిల్లా పేదల గుండెల్లో గూడుకట్టుకున్న ఫెర్రర్ చరిత్రలో చిరస్మరణీయులుగా మిగిలిపోతారని పలువురు కొనియాడారు.