కొండపి: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి స్వామి కార్యాలయంలో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి స్వామి లబ్ధిదారులకు 58 లక్షల రూపాయలకు పైగా విలువ చేసి చెక్కులను అందజేశారు. ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు అడిగిన వెంటనే సీఎం చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేశారని మంత్రి స్వామి అన్నారు.