యర్రగొండపాలెం: సీజన్ మొదలయ్యేనాటికి నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ నింపేలా పనులు జరుగుతున్నాయని వెల్లడించిన మంత్రి రామానాయుడు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టును రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించి వివరాలను వెల్లడించారు. నత్త నడకన సాగుతున్న 21 కిలోమీటర్ల లైనింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం సీజన్ మొదలయ్యే నాటికి నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ నింపేలా పనులు జరుగుతున్నాయన్నారు. ఈ నెలలో సీఎం చేతుల మీదుగా నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ పరిహారం అందిస్తామన్నారు. నీళ్లు నింపడానికి నిర్వాసితుల పునరావాసానికి అదనపు బడ్జెట్లో 905 కోట్లు కేటాయించామన్నారు.