ఉరవకొండ: బెలుగుప్ప తహసిల్దార్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి వేడుక
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి వేడుకను మండలాధికారులు రెవిన్యూ కార్యాలయ సిబ్బంది ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం రాజధాని అమరావతిలో 150 కోట్ల వ్యయంతో ఆంధ్ర రాష్ట్రానికి కాకుండా దేశానికే ఆదర్శప్రాయుడిగా కీర్తించబడే పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారని ఎంపీడీవో లక్ష్మీనారాయణ ఏవో పృథ్వి సాగర్, డీటీ గురు బ్రహ్మ లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వి ఆర్ ఓలు, వి ఆర్ ఏలు పాల్గొన్నారు.