దర్శి: మెగా డీఎస్సీ అవకతవకలపై విచారణ జరపాలని డిమాండ్ చేసిన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
Darsi, Prakasam | May 29, 2026 ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు మరియు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ అవకతవకలపై విచారణ జరపాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒంగోలు అంబేద్కర్ సెంటర్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన తెలిపారు. మెగా డీఎస్సీ కాదు దగా డిఎస్సి అని విమర్శించారు. కష్టపడి చదివిన అభ్యర్థులు నష్టపోకుండా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.