యర్రగొండపాలెం: దోర్నాలలో పెట్రోల్ బంకు వద్ద ద్విచక్ర వాహనదారులు ఆందోళన
మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలో ఓ పెట్రోల్ బంకు వద్ద ద్విచక్ర వాహనదారులు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. భారీగా వాహనాలు చేరడంతో పరిస్థితిని నియంత్రించలేక నిర్వాహకులు కొంతసేపు పెట్రోల్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన వాహనదారులు హారంలు మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో మళ్లీ బంకును యధావిధిగా ప్రారంభించారు. పోలీసుల అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.