రాయదుర్గం: తుంగభద్ర రిజర్వాయర్ కు వరదనీటి రాక ఆరంభం
కర్నాటక లోని తుంగభద్ర ఎగువన గత మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. శృంగేరి వద్ద ఉన్న తుంగా నది ఆనకట్ట నిండడంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తుంగభద్ర రిజర్వాయర్ కచ వరదనీటి రాక ఆరంభమైంది. మంగళవారం ఉదయం తుంగా నది నుంచి సుమారు 20 వేల క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేయడంతో, మరో రెండు, రోజుల్లో తుంగభద్రకు వరదనీరు చేరే అవకాశం ఉంది. తుంగభద్ర రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 105 టిఎంసిలు కాగా ప్రస్తుతం 9.5 టిఎంసిల నురు మాత్రమే నిల్వ ఉంది. గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత అట్టడు స్థాయికి నీటి నిల్వలు పడిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.