మార్కాపురం: మార్కాపురంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని తెలిపిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత నేడు ఒక ప్రకటనలోతెలిపారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారు లకు అందజేయాలన్నారు. ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె చెప్పారు.