దర్శి: బొద్దికూరపాడు గ్రామంలో ఘనంగా మొహరం పండుగ వేడుకలు
Darsi, Prakasam | Jun 25, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో మొహరం పండుగ ఘనంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి పెద్ద షరగత్ సందర్భంగా గ్రామంలో పేర్లను ఊరేగించారు. అనంతరం భక్తులు భక్తిశ్రద్ధలతో అగ్నిగుండంలో తిరిగారు. ఈ పండుగను కులమతాలకతీతంగా జరుపుకోవడం ఆనవాయితీ. మూడు రోజులుగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొన్నది.