మార్కాపురం: రాయవరం సమీపంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం చేపట్టకపోవడంతో తుప్పు పడుతున్న ఇనుము
మార్కాపురం మండలం రాయవరంలో గత ప్రభుత్వం 475 కోట్ల బడ్జెట్ తో వైద్య కళాశాల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం 47.5 కోట్లు ఖర్చు చేసి భవనాలను ప్రారంభించారు. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి అనంతరం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో వైద్య కళాశాల నిర్మాణం చేపడతామన్నారు. అయితే నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇనుము తుప్పు పట్టి పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.