తాడిపత్రి: తలారి చెరువు గ్రామ సమీపంలోని బావి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామ సమీపంలోని భావి వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై తాడిపత్రి రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి లోతుగా విచారణ, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.