రాయదుర్గం: కళ్యం గ్రామ శివారులో జూద స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు, ముగ్గురు అరెస్టు
డి.హిరేహాల్ మండలంలోని కళ్యం గ్రామంలో జూదకేంద్రాలపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. శనివారం సాయంత్రం పక్కా సమాచారంతో రూరల్ సీఐ వెంకటరమణ ఆదేశాలతో ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు. ముగ్గురిని అరెస్టు చేసి రూ32050 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జూద స్థావరాలపై తమకు సమాచారం అందించాలని కోరారు. మొబైల్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ బెట్టింగ్ ఉచ్చులో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.