కళ్యాణదుర్గం: రంగయ్య పాల్యం శివారులో చిరుత దాడిలో గొర్రెలు మృతి చెందిన ఘటనపై విచారణ చేపట్టిన ఫారెస్ట్ అధికారులు
సెట్టూరు మండలం రంగయ్య పాళ్యం గ్రామ శివారులో బుధవారం నందన్న అనే గొర్రెల కాపరికి చెందిన పది గొర్రెలు చిరుత దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత రైతు ఫారెస్ట్ అధికారులు, పశువైద్యాధికారులకు సమాచారం ఇచ్చాడు. ఫారెస్ట్ అధికారులు గురువారం గొర్రెలు మృతి చెందిన ఘటనపై విచారణ చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరుత దాడి వల్ల మృతి చెందాయా? లేక ఇతర కారణాలవల్ల మృతి చెందాయా? అనే కోణంలో విచారణ చేపట్టారు.