మార్కాపురం: గురుకుల పాఠశాలకు ఎంపికైన తర్లుపాడు మండలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఎంట్రన్స్ పరీక్షలో తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. మొత్తం ఏడు మంది విద్యార్థులు పరీక్షలు రాయగా నలుగురు బాలురు ముగ్గురు బాలికలు ఏడు మంది అర్హత సాధించారని పాఠశాల హెచ్ఎం మౌలాలి తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు