గిద్దలూరు: గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యత లేని ఆహారం సరఫరా, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న రోగులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న ఆహారం నాణ్యత లోపించిందని రోగులతో పాటు వారి బంధువులు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా రోగులకు అందిస్తున్న ఆహారం నాణ్యత లేదని అధికారులకు ఫిర్యాదు చేస్తున్న పట్టించుకోవడంలేదని ఒంగోలులో ఉండే కాంట్రాక్టర్ గిద్దలూరులో ఒకరికి అప్పగించడం వల్ల పర్యవేక్షణ లోపం వల్ల ఆహారం నాణ్యత లేదని రోగుల బంధువులు రోగులు తెలిపారు. గతంలో ఫిర్యాదు కూడా చేశామని కానీ ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.