రాయదుర్గం: సత్యసాయి కార్మికుల సమ్మెతో గ్రామాలకు నిలిచిపోయిన తాగునీటి సరఫరా
బకాయి వేతనాల కోసం సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేసే కార్మికులు చేపట్టిన సమ్మె ఐదవ రోజుకు చేరుకుంది. శనివారం డి.హిరేహాల్ మండలంలోని గొడిశలపల్లి పంప్ హౌస్ వద్ద కార్మికులు నిరసన తెలిపారు. ఐదు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వకపోతే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. నెలనెల సక్రమంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులు సమ్మె చేపడుతుండటంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాగునీటి సరఫరా ఆగిపోయింది.