మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చింతల సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. గాజుల మోటు వద్ద మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసి ఆవును హతమార్చింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది పులి సంచరించిన ప్రాంతానికి చేరుకుని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినారు. ఆవుల మందపై పెద్దపులి దాడి చేసినట్లు నిర్ధారించారు.