గిద్దలూరు: గిద్దలూరు లోని మార్కెట్ వ్యాపారులకు తీవ్ర నష్టాలు, వేసవికాలం వల్ల వ్యాపారలు లేక కుళ్ళిపోతున్న కూరగాయలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ లో వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారులు సరైన వ్యాపారాలు లేక నష్టపోతున్నట్లు శనివారం తెలిపారు. వేసవికాలం కావడం వల్ల కూరగాయలు కొనుగోలు చేసేవారు కరువై ఆర్థికంగా నష్టపోతున్నామని కూరగాయలు కుళ్ళిపోతున్నాయని వ్యాపారులు తెలిపారు. అన్ని కూరగాయలు ధరలు అమాంతం ఎక్కువగా ఉండగా కొన్ని కూరగాయల మరింత తక్కువ ధరలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.