కొండపి: ఏపీలోని గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి వెల్లడి
గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు మంత్రి డోలా అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఐఐటి, నీట్ ప్రవేశ పరీక్షలకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యే తామస్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. తాను మాట్లాడిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించినట్లు థామస్ చెప్పినట్లు ఆయన తెలిపారు. అంబటి, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై తాము స్పందించాల్సిన అవసరంలేదన్నారు. మద్యం కుంభకోణంలో విచారణ సాగుతోందన్నారు.