దర్శి: దర్శి సర్కిల్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన పలువురికి జరిమానా జైల్ శిక్ష విధించినట్లు తెలిపిన సిఐ రామారావు
Darsi, Prakasam | May 22, 2026 ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ 21 మందిని కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ రామారావు తెలిపారు. దర్శి కురిచేడు ముండ్లమూరు పోలీస్ స్టేషన్ల కేసుల్లో ఇద్దరికీ 15 రోజులు జైలు శిక్ష విధించారు. మరో ఇద్దరికి ఏడు రోజుల జైలు శిక్ష మిగిలిన 17 మందికి పదివేల రూపాయల చొప్పున జరిమానా విధించారని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.