రాయదుర్గం: ఆర్టీసి లేదా ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులు బస్సులు కొనుగోలు చేయాలి : AP PTD నేషనల్ మజ్దూర్ యూనియన్ డిమాండ్
విద్యుత్తు బస్సులను ఆర్టీసి లేదా ప్రభుత్వం ద్వారా మాత్రమే కొనుగోలు చేసి, ఆర్టీసీ సిబ్బందితోనే బస్సులు నడపాలని ఏపిపిటిడి నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోషియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. రెండు రోజుల డిమాండ్స్ డే సందర్బంగా బుధవారం తెల్లవారుజాము నండి డిమాండ్ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అలాగే రాయదుర్గం డిపో వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసిస్టెంట్ సెక్రెటరీ ఎస్. నాగరాజు, డిపో కార్యదర్శి హెచ్.తిప్పేస్వామి, అధ్యక్షులు రామాంజనేయులు, రీజనల్ నాయకులు సిద్దేశ్వర, రవినాయక్ తదితరులు మాట్లాడారు.