కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బహిరంగంగా మద్యం తాగుతున్న మందుబాబులపై చర్యలు తీసుకున్న పోలీసులు
ఉమ్మడి ప్రకాశ జిల్లాలో బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలను పోలీసులు గుర్తించి మందుబాబులపై ఆదివారం చర్యలు తీసుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలను గుర్తించి మద్యం తాగుతున్న వారితోనే శుభ్రం చేయించడం జరిగిందని పోలీసులు వెల్లడించారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై చర్యలు తీసుకుంటూ వారికి జరిమానా విధించామన్నారు. అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు బహిరంగంగా మద్యం తాగకుండా నిరోధిస్తున్నామని పోలీసులు తెలిపారు.