దర్శి: పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన దొనకొండ ఎమ్మార్వో రమాదేవి
Darsi, Prakasam | Apr 27, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేకనే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎమ్మార్వో రమాదేవి పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. పెట్రోల్ బంకుల సేల్స్ ఆఫీసర్స్ కి ఫోన్ చేసి మాట్లాడే తక్షణమే ఆయిల్ పంపిణీ చేయాలని సూచించారు. పెట్రోల్ బంకుల వద్ద సీఐ రామకృష్ణ పర్యవేక్షణతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్రోల్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.