మార్కాపురం జిల్లా తిరుప్రాంతకం మండలం పాత అన్న సముద్రంలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో 15 ఇండ్లు కూలిపోయాయి. ఇండ్లపై రేకులు ఎగిరిపోవడంతో పలు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఇండ్లలోని బియ్యం బట్టలు నిత్యావసర వస్తువులు వర్షంలో తడిసిపోయాయి. దీంతో బాధితులు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని వేడుకున్నారు.