కొండపి: పర్యటక శాఖ మంత్రిని కలిసి కంభం చెరువు అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం అమరావతి మంత్రి క్యాంపు కార్యాలయంలో పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద చెరువులలో ఒకటైన మానవత నిర్మితమైన చెరువు కంభం చెరువును పర్యటక ప్రదేశంగా మార్చేందుకు నిధులు కేటాయించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కంభం చెరువును పర్యటక ప్రదేశంగా మార్చేందుకు కృషి చేస్తామని అన్నారు.