కొండపి: దివ్యాంగులకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చాం: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రతి జిల్లాలో దివ్యాంగుల కోసం దివ్యాంగుల భవనం ఏర్పాటు చేస్తామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. శనివారం మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ లో జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొని ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 ద్విచక్ర వాహనాలను దివ్యాంగులకు అందిస్తున్నామని మంత్రి అన్నారు.