దర్శి: దర్శి మండలం ఎర్రఓబనపల్లిలో టిడిపి పార్టీలో చేరిన 10 వైసీపీ కుటుంబాలు
ప్రకాశం జిల్లా దర్శి మండలం ఎర్రఓబనపల్లిలో ఎస్సీ వైసీపీకి చెందిన పది కుటుంబాలు టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో టిడిపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 20 నెలల్లో చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు స్వచ్ఛందంగా టిడిపి వైపు వస్తున్నారని తెలిపారు. కుల మత వర్గ భేదాలు లేకుండా అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.