విజయనగరం అర్బన్: విజయనగరంలో ఘనంగా ప్రపంచ మధుమేహ దినోత్సవ వాకథాన్ - ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Vizianagaram Urban, Vizianagaram | Nov 14, 2026
ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా విజయనగరంలో అవగాహన వాకథాన్ నిర్వహించారు. కోట జంక్షన్ నుండి సింహాచలం మేడ వరకు జరిగిన ఈ ర్యాలీని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. మధుమేహ నియంత్రణకు ప్రతిరోజూ నడక అవసరమని మంత్రి సూచించారు.