రాయదుర్గం: డి.హిరేహాల్ NAS వైన్ షాప్‌లో బహిరంగ దోపిడీ, బాటిల్‌పై రూ.20 అదనపు వసూళ్లు
.హిరేహాల్ పట్టణంలోని NAS వైన్ షాప్‌లో వినియోగదారుల నుంచి ప్రతి మద్యం సీసాపై ఎంఆర్పీ ధరకు అదనంగా రూ.20 చొప్పున వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అధిక ధర ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించిన వినియోగదారులతో షాప్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తిస్తూ, "మీ దిక్కున్న చోట చెప్పుకోండి" అంటూ బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ కంటే అధిక ధరలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని, సంబంధిత ఎక్సైజ్ అధికారులు వెంటనే స్పందించి షాప్‌పై తనిఖీలు నిర్వహించి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.