గిద్దలూరు: గిద్దలూరు టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బారు కార్యక్రమం, అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే కొన్నిటిని తక్షణమే పరిష్కరించారు. మరికొన్నిటిని సాధ్యమైనంత త్వరలో సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకే ప్రతి నెలలో రెండు మూడుసార్లు ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.