రాయదుర్గం: ఆవులదట్ల సమీపంలో చిరుత సంచారం, భయాందోళనలో రైతులు
రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామం పరిసరాల్లో గత రెండు రోజులుగా చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత భయంతో రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. గ్రామ శివారులోని ఓ పొలంలో శనివారం చిరుత అడుగుజాడలు కనిపించాయని రైతులు తెలిపారు. గ్రామస్తులు అటవీ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ, చిరుత నుండి ప్రాణహాని లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.