యర్రగొండపాలెం: రాజంపల్లి గ్రామ సమీపంలోని గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామ సమీపంలో వెలిసిన గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు భవాని ప్రసాద్ తెలిపారు. ఆదివారం సాయంత్రం నుండి ప్రారంభమై తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. సోమవారం తెల్లవారుజామున స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం ఉంటుందన్నారు. సంతానం కావలసిన భక్తుడు ఆదివారం రాత్రి గరుడ ప్రసాదం స్వీకరించాలన్నారు