ఉరవకొండ: ఉరవకొండ లోని ఆర్ అండ్ బీ బంగ్లాలో అంబేద్కర్ జయంతి కరపత్రాలు ఆవిష్కరణ
ఉరవకొండ లోని ఆర్ అండ్ బీ బంగ్లాలో శుక్రవారం అంబేద్కర్ జయంతి కరపత్రాలను అంబేద్కర్ ఉత్సవ సమితి నాయకులు ఆవిష్కరించారు. అంబేద్కర్ ఉత్సవ సమితి నియోజకవర్గం కన్వీనర్ మీనుగ మధు ప్రసాద్ మాట్లాడారు. ఈనెల 14న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని జాతీయ పండుగలాగా నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.