మార్కాపురం: బ్రహ్మోత్సవాల సందర్భంగా సార్వభౌమ అలంకారంలో గజ వాహనంపై చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనం
మార్కాపురం లో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా గజ వాహనంపై సార్వభౌమ అలంకారంలో చెన్నకేశవ స్వామి పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. మేళ తాళాలు భజంత్రీల మధ్య ఊరేగింపు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మ్యూజిక్ ఆర్కెస్ట్రా, మహిళలు చిన్నారులు కోలాటం భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులు స్వామి వారికి కాయ కర్పూరం సమర్పించారు