యర్రగొండపాలెం: త్రిపురాంతకంలో కోతుల బెడదతో బెంబేలెత్తిపోతున్న స్థానికులు, దుకాణదారులు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో కోతుల దెబ్బకు స్థానికులు బింబెలెత్తుతున్నారు. గుంపులు గుంపులుగా నివాస గృహాలపై దుకాణాల వద్ద తిరుగుతున్నాయి. దీంతో దుకాణదారులు స్థానికులు భయపడుతున్నారు. వాటిని తోలడానికి వెళ్తే ఎదురు తిరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. తినే వస్తువు ఏది కనపడిన తీసుకెళ్తున్నాయన్నారు. సంబంధిత పంచాయతీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.