యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండల కేంద్రంలోని చిన్న కండ్లేరు చెరువుకు గండి వృధాగా పోతున్న నీరు
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలోని చిన్న కండ్లేరు చెరువు గండిపడి నీరు వృధాగా పోతుంది. గత కొన్ని రోజులుగా ఈ పరిస్థితి ఈ నెలకొన్నదని రైతులు తెలిపారు. అసలే వేసవికాలం నీరు వృధాగా పోతే పంట పొలాల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడతామన్నారు. స్థానిక ప్రజలకు కూడా మంచినీటి ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. సంబంధిత అధికారులు చెరువుకు పడిన గండిని పూడ్చి వేయాలని విజ్ఞప్తి చేశారు.