కళ్యాణదుర్గం: కుందుర్పిలో రాధాస్వామి విద్యాలయంలో అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు
కుందుర్పి మండల కేంద్రంలో రాధాస్వామి విద్యాలయంలో శనివారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, బాలికలు డాన్సులు చేసి అందరినీ మెప్పించారు. సుమారు మూడు గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.