దర్శి: ఈదర గ్రామంలో సాయిబాబా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం
ప్రకాశం జిల్లా ముళ్ళమూరు మండలంలోని ఈదర గ్రామంలో సాయిబాబా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోక్షరణ నడుమ భక్తిశ్రద్ధలతో వైభవంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. శాస్రోప్తకంగా సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.