దర్శి: తాళ్లూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారానికి ఆనందం వ్యక్తం చేసిన విద్యార్థులు
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అందిస్తున్న పౌష్టికాహారం ఎంతో బాగుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అన్నారు. వేరుశనగ చిక్కిలు ఇతర ఆహార పదార్థాలు నిరంతరం విద్యార్థులకు అందిస్తున్నారు. దీంతో తమకు అందిన ఆహార ప్యాకెట్లను చూపిస్తూ విద్యార్థులు ఆనందంలో ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.