రాయదుర్గం: పట్టణంలో ఘనంగా వాసవీ మాత జయంతి ఊరేగింపు
వాసవీ జయంతి సందర్భంగా రాయదుర్గం పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బారీ ఊరేగింపు నిర్వహించారు. పట్టణంలోని కోట ఏరియాలో ప్రసిద్ధ నగరేశ్వర స్వామి ఆలయంలో వాసవీ కన్యకాపరమేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాసవీ మాత చిత్రపట ఊరేగింపు నిర్వహించారు. కేరళ కళా బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వినాయక కూడలి, లక్ష్మీబజార్ మీదుగా సాగిన ఊరేగింపులో వందలాది మంది ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.