మార్కాపురం: ఎస్ వి కె పి కళాశాలలో వాకింగ్ ట్రాక్ ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురంలోని ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన వాకింగ్ ట్రాక్, జిమ్ లను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఈ కళాశాలకు ఘన చరిత్ర ఉందని ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారన్నారు. ఇప్పటికైనా ఈ కళాశాల మైదాన ప్రాంగణo లో వాకింగ్ ట్రాక్, జిమ్ లను ఏర్పాటు చేయటం ఎంతో సంతోషదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.