దర్శి: ఇడుపులపాయలో వైయస్సార్ ఘాట్ కు పుష్పాంజలి అర్పించిన కాంగ్రెస్ పార్టీ దర్శి ఇన్చార్జి వెంకటకృష్ణారెడ్డి
కడప జిల్లా ఇడుపులపాయలో జరిగిన వైయస్సార్ జయంతి వేడుకల్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి జిల్లా అధ్యక్షులు షేక్ సైదా తో కలిసి కాంగ్రెస్ పార్టీ దర్శి ఇన్చార్జి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రూపొందించిన ప్రత్యేక పోస్టర్ వైయస్ విజయమ్మ చేతుల మీదుగా ఆవిష్కరించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహానేత రాజశేఖర్ రెడ్డి చూపిన ప్రజాసేవ మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు అంకితభావంతో పని చేస్తానని పేర్కొన్నారు.