కొండపి: సింగరాయకొండ సమీపంలో జి.టి ఎక్స్ప్రెస్ రైలు పైకి మద్యం సీసాలు విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు, గాయపడ్డ పైలట్
ఓ ప్రయాణికుడి నిర్లక్ష్యంతో రైల్వే పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఒంగోలు సింగరాయకొండ మార్గాల మధ్య బుధవారం రాత్రి చోటుచేసుకుంది. విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న జీ.టి ఎక్స్ప్రెస్ రైలు సింగరాయకొండ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న రైలు భోగి నుంచి ఓ కవర్ జిటి ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్లోకి దూసుకు వచ్చింది. ఆ సమయంలో అద్దం సమీపంలో ఉన్న పైలెట్ పై పడింది. అందులో మద్యం సీసాలు ఉండడంతో పైలెట్ కి తీవ్ర గాయాలయ్యాయి. కో- పైలెట్లు వెంటనే సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో ప్రథమ చికిత్స అందించారు. గుర్తు తెలియని ఓ ప్రయాణికుడు మద్యం సేవించి ఈ పని చేసినట్లు పోలీసులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు