గిద్దలూరు: గిద్దలూరు మండలం క్రిష్టం శెట్టిపల్లి గ్రామ సమీపంలోని పొలాలలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో రెండు ముక్కలుగా చీలిన చెట్టు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టం శెట్టిపల్లి గ్రామ సమీపంలోని పొలాలలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో కొబ్బరి చెట్టు రెండు భాగాలుగా విడిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తూ పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో కొబ్బరి చెట్టు కొమ్మలన్నీ నేలకొరిగాయి. అంతేకాకుండా చెట్టు మధ్యభాగానికి చీలిపోయింది. పిడుగుపడ్డ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎటువంటి అపాయం జరగలేదని స్థానిక ప్రజలు తెలిపారు.